అమెరికన్ యూనివర్సిటీ, దుబాయ్‌ల ఆర్కిటెక్చర్ కోర్సులకు.. దేశీయంగా గుర్తింపు
అమెరికాలోని లాస్ఏంజెలెస్లోని సదరన్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (ఎస్సీఐ ఆర్క్) ప్రదానం చేసిన మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్-2 పట్టా, యూఏఈలోని అమెరికన్ యూనివర్సిటీ ఇన్ దుబాయ్ ప్రదానం చేసిన బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పట్టాలకు దేశీయంగా గుర్తింపు ఇస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు గుర్తింపు పొందిన కోర్సుల జాబితాలో ఈ రెండింటినీ చేరుస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్కిటెక్చర్ యాక్ట్`1972 లోని సెక్షన్ 15(1) ప్రకారం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది.






