ఆ సమాధి బంగారు కొండ … అది 1200 ఏళ్లనాటి
అది 1200 ఏళ్లనాటి సమాధి. పురావస్తు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో భాగంగా ఆ సమాధిని గుర్తించి, తవ్వకాలు జరిపారు. బంగారు ఆభరణాలు, విలులైన వస్తువులు దర్శనమివ్వడంతో పురావస్తు శాస్త్రవేత్లు విస్తుపోయారు. మధ్య అమెరికాలోని పవామాలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆ సమాధిలో పదుల సంఖ్యలో మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. అలాగే, బంగారంతో తయారు చేసిన దుస్తులు, బ్రాస్లెట్లు, బెల్టులు, ఆభరణాలు, తిమింగలం పన్నుతో అలంకరించిన చెవిపోగులు, సిరామిక్ వస్తువులు వంటివి ఉన్నాయి. కోక్లే సంస్కృతి చెందిన ఉన్నతస్థాయి వర్గానికి చెందిన ప్రభువు సమాధిగా దీనిని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.






