రష్యాతో చైనా బంధంపై… నాటో ఆందోళన
రష్యాతో చైనా బంధం మరింత బలపడుతుండటంపై నాటో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతుండటంలో చైనా నిర్ణయాత్మక పాత్ర పోషిస్తోందంటూ ఆరోపించింది. అమెరికా రాజధాని వాషింగ్టన్లో సదస్సు ముగిసిన అనంతరం నాటో ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. బీజింగ్ తీరుతో తమ కూటమిలోని సభ్య దేశాల ప్రయోజనాలు, భద్రత, విలువలకు సవాళ్లు ఎదురవుతున్నాయని అందులో పేర్కొంది. రష్యాతో చైనాది పరిమితులు లేని బంధమని వ్యాఖ్యానించింది. మాస్కోకు ఆ దేశం రక్షణ పారిశ్రామిక రంగంలో పెద్దఎత్తున అండగా నిలుస్తోందంటూ విమర్శించింది.






