అమెరికాతో హాట్‌లైన్ వినియోగంలో లేదు : రష్యా
అమెరికా`రష్యా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన వేళ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఏర్పాటు చేసిన హాట్‌లైన్ వ్యవస్థ ఇప్పుడు వినియోగంలో లేదు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా, అమెరికా అధ్యక్షుల మధ్య చర్చలు జరపడానికి ఓ సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంది. వీడియో కూడా ప్రసారం చేయగలదు అని పెస్కోవ్ పేర్కొన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం వేళ క్యూబా మిసైల్ సంక్షోభం తలెత్తిది. దీంతో అపార్థాలకు చోటివ్వకుండా ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికి వీలుగా ఇరు దేశాలు 1963లో హాట్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొన్నాయి.






