అమెరికా క్యారమ్స్ పోటీల్లో.. హైదరాబాద్ వాసుల సత్తా
అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రపంచ ఆరో క్యారమ్స్ పోటీలలో హైదరాబాద్ నగరానికి చెందిన క్రీడాకారులు సత్తాచాటారు. హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్, మహమ్ముద్ ఆరిఫ్ (ముంబయి)తో కలిసి డబ్బుల్ విభాగంలో స్వర్ణం సాధించారు. స్విస్ లీగ్ పోటీలలో ఎస్ ఆదిత్య రజతం, ఎమ్ఏ హకీమ్ కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. హైదరాబాద్ నగరానికి చెందిన ముగ్గురు క్రీడాకారులు తెలంగాణ, దేశానికి గర్వకరణంగా నిలిచారని తెలంగాణ క్యారమ్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మదనరాజ్, ఉపాధ్యక్షుడు ఉప్పు సుధాకర్ అభినందనలు తెలిపారు.






