AI Express :ఏఐ ఎక్స్‌ప్రెస్ శుభవార్త… పశ్చిమాసియా, సింగపూర్ విమానాల్లో

పశ్చిమాసియా దేశాలు, సింగపూర్(Singapore)కు ప్రయాణించే తమ విమానాల్లో ఒక ప్రయాణికునికి చెక్డ్-ఇన్ బ్యాగేజ్ (Checked-in baggage) కింద ప్రస్తుతం 20 కిలోల వరకు ఉచితంగా అనుమతినిస్తుండగా దీనిని 30 కిలోలకు పెంచుతున్నట్లు ఏఐ ఎక్స్‌ప్రెస్(AI Express) తెలిపింది. పసికందులతో ప్రయాణించే కుటుంబాలకు అదనంగా మరో 10 కిలోల వరకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడిరచింది. ప్రయాణికుల 7 కిలోల కేబిన్ బ్యాగేజీతో పాటు ఇక నుంచి 30 కిలోల వరకు చెక్డ్ ఇన్ లగేజీని ఉచితంగా తీసుకెళ్లొచ్చు. భారత్(India) నుంచి సింగపూర్, పశ్చిమాసియా ప్రాంతాలకు నడిచే ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్(Air India Express) విమానాల్లోనే ఈ సదుపాయం వర్తిసుందని కంపెనీ తెలిపింది. మన దేశ నగరాల నుంచి పశ్చిమాసియా నగరాలకు వారంలో 450 సర్వీసులను, సింగపూర్‌కు 26 సర్వీసులను ఏఐ ఇండియా ఎక్స్‌ప్రెస్ నిర్వహిస్తోంది.