Indians :భారతీయులపైనా ఉక్కుపాదం
అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ స్వదేశాలకు పంపుతున్న అమెరికా(America), భారతీయుల పైనా దృష్టి సారించింది. దేశంలో అక్రమంగా ఉంటున్న దాదాపు 18,000 మందిని గుర్తించి 17,940 మందిని భారత్ (India)కు పంపేందుకు తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా టెక్సాస్ (Texas)లోని శాన్ ఆంటోనియో నుంచి సీ-17 అనే సైనిక విమానంలో దాదాపు 205 మందిని పంజాబ్లోని అమృత్సర్ (Amritsar)కు తొలి విడతలో వెనక్కి పంపుతోంది. ఈ విమానం మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరినట్లు ఢలీిలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడిరచారు. ఇది భారత్కు చేరుకోవడానికి 24 గంటల సమయం పడుతుందని అంచనా. మధ్యలో ఇంధనం నింపుకోవడానికి జర్మనీలో రాంస్టీన్లో ఆగుతుంది. వెనక్కి పంపేముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించామని అధికారులు వెల్లడిరచారు. రానున్న రోజుల్లో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నాయని వివరించారు. వాస్తవానికి సీ-17 విమానం కెపాసిటీ 140 మందే. కానీ తాలిబన్లు అఫ్గానిస్థాన్లో అధికారం చేజిక్కించుకున్నప్పుడు సీ`17 విమానాల్లో 600 మంది నుంచి 800 మంది దాకా ప్రయాణించారు.






