NATS: నాట్స్ వాలీబాల్ టోర్నీకి ముహూర్తం ఫిక్స్
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 27న న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లే టౌన్షిప్లో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించేందుకు ముహూర్తం ఖరారైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగనుంది. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే వారు కనీసం ఎనిమిది మంది ఆటగాళ్లతో జట్లుగా ఏర్పడాల్సి ఉంటుంది. ఈ జట్లు $150 ఫీజు చెల్లించి టోర్నీలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. టోర్నీ విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు అందిస్తారు.
ఈ టోర్నమెంట్ ఏర్పాట్లను నాట్స్ (NATS) ఛైర్మన్ శ్రీహరి మండాది, నాట్స్ (NATS) ప్రెసిడెంట్ ప్రశాంత్ పిన్నమనేని పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి డైరెక్టర్ల బోర్డు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు, న్యూజెర్సీ చాప్టర్ అడ్వైజరీ టీమ్, ఇతర కమిటీ సభ్యులు, వాలంటీర్లు కృషి చేస్తున్నారు. ఈ టోర్నమెంట్‌కు పలు మీడియా స్పాన్సర్లుగా జేఎస్‌డబ్ల్యూ టీవీ, మహా న్యూస్, టీవీ5 న్యూస్, టీవీ9 యూఎస్ఏ, యూబ్లడ్ ఉన్నారు. ఈ టోర్నీని దేశీ ధమాక, అమోఘ గ్రూప్ స్పాన్సర్ చేస్తున్నాయి.టోర్నీలో పాల్గొనాలని అనుకునేవారు http://linktr.ee/NATSNJ లింకులో రిజిస్టర్ చేసుకోవచ్చు.






