తెలంగాణలో రికార్డు స్థాయిలో కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకి పెరుగుతున్న కేసులు జనంలో గుబులు రేపుతున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 5356 శాంపిల్స్ పరీక్షించగా… 1213 కేసులు పాజిటివ్‌గా తేలాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 18,570కి పెరిగింది. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదుకావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. హైదరాబాద్ పరిధిలోనే 998 కేసులు నమోదు కావడం కలవరం రేపుతోంది. రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మరణాల సంఖ్య 275కి పెరిగాయి. అలాగే, ఈ రోజు 987 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జిల సంఖ్య 9069కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9226 యాక్టివ్ కేసులు ఉన్నాయి.






