Psych Siddhartha: ‘సైక్ సిద్ధార్థ’చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది : శ్రీ నందు
యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ ‘సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జనవరి 1న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీ నందు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నారు?
-ఇప్పుడే డల్లాస్ లో స్పెషల్ స్క్రీనింగ్ హౌస్ ఫుల్ షో పడింది. అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చాలా ఆనందంగా ప్రశాంతంగా వుంది.
గతంలో ఎన్నడూ లేని ఎమోషన్ ఈ సినిమా విషయంలో కనిపించింది.. కారణం?
-18 ఏళ్ల నా కెరీర్ లో చాలా సినిమాలు చేశాను. కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు కథ ఇలా ఉంటే బాగుండేది కదా.. అనిపించేది కానీ నాకు చెప్పడానికి ఆస్కారం లేదు. నా జడ్జిమెంట్ కరెక్టా, రాంగ్ గా అని తెలుసుకోవడానికి నేనొక ప్రయత్నం చేయాలనుకున్నాను. అలా నా జడ్జిమెంట్ ని నమ్మి ఒక డైరెక్టర్ని, కథని నమ్మి చేసినా సినిమా ఇది. ఒక ఫైనల్ డెస్టినేషన్ లాగా పెట్టుకుని వచ్చాను. సురేష్ బాబు గారు మమ్మల్ని బిలీవ్ చేయడంతోనే మేము 90% గెలిచేసినట్టు. అక్కడే నా జడ్జిమెంట్ రైట్ అనిపించింది. ఇవన్నీ కలిసి వచ్చిన ఎమోషన్ అది.
దండోరా లో మీరే మెయిన్ లీడ్ లా అనిపించారు.. కానీ ప్రమోషన్స్ లో ఎక్కువ కనిపించుకోవడానికి కారణం?
-దండోరా స్క్రిప్ట్ వినగానే చాలా నచ్చింది. ఆ సినిమాలో నా పెర్ఫార్మన్స్ కు చాలా మంచి అప్రిషియేషన్స్ వచ్చాయి. ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. అయితే ఆ సినిమాని ప్రమోషన్స్ చేయడానికి చాలామంది ఉన్నారు. ఈ సినిమాకి నా అవసరం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ప్రమోషన్స్ చేయడం జరిగింది.
సైక్ సిద్ధార్థ కథ ఎలా ఉండబోతుంది?
-ఒక అబ్బాయి జీవితంలోకి అమ్మాయి రావడంతో మోసపోతాడు. అదే అబ్బాయి జీవితంలోకి మరో అమ్మాయి రావడంతో బాగుపడతాడు. కథగా చెప్పుకుంటే ఇంత సింపుల్ గా ఉంటుంది. కానీ ఈ కథని ప్రజెంట్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. డిఫరెంట్ స్క్రీన్ ప్లే, ఒక న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్ తో వస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఆడియన్స్ ఇప్పటివరకు ఎన్నడూ చూడని ఎడిటింగ్ పాటర్న్ ఇందులో కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కొత్తగా ఉంటుంది. జెన్‌జీ ఆడియన్స్ కి బాగా నచ్చ్తుంది. సెకండ్ హాఫ్ అందరికీ యునానిమస్ గా నచ్చుతుంది.
– ఈ కథలో చాలా మూస పద్ధతుల్ని బ్రేక్ చేశాం. ఫస్ట్ హాఫ్ నిజంగా చెప్పాలంటే ఒక వీడియో గేమ్ చూసినట్టుగా ఉంటుంది. జెన్‌జీ ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఫస్టాఫ్ అర్థమైన వాళ్ళు జీవితాంతం ఆ ఫస్టాఫ్ గురించే మాట్లాడుతూ ఉంటారు. సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ గా ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అవుతుంది. హీరోయిన్ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమా చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కంటెంట్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది.
నిర్మాతగా డబ్బులు పెట్టారు కదా రిస్క్ అనిపించలేదా?
-డబ్బులు విషయంలో క్యాలిక్యులేటివ్ రిస్క్ ఉంటుంది. అయితే మన మీద మనకి నమ్మకం లేనప్పుడు వేరే నిర్మాత మనల్ని ఎందుకు నమ్మాలి అనే ఉద్దేశంతో, దేవుడు ఒక అవకాశం ఇచ్చిన తర్వాత కచ్చితంగా ఒక గట్టి ప్రయత్నం చేయాలనిపించింది. నేను దాచుకున్న డబ్బు నుంచే నా మీద నేను ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నాను.. ధైర్య సాహసి లక్ష్మీ అంటారు. దాన్ని బలంగా నమ్మాను. ఆ నమ్మకం నిజమైంది.
ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత అర్జున్ రెడ్డి తో పోలికలు వచ్చాయి కదా?
ఆ గడ్డం, క్యారెక్టర్ లౌడ్ గా మాట్లాడడంతో పోలికలు వచ్చాయని అనిపిస్తుంది. కానీ సినిమా చూసిన తర్వాత అర్జున్ రెడ్డి దీనికి అసలు ఏ మాత్రం పోలిక ఉండదు.
సురేష్ బాబు గారు సినిమా తీసుకున్నారు.. ఇంకా మీలో ఏదో టెన్షన్ ఎందుకు కనిపిస్తుంది ?
నాకు డబ్బు కంటే గౌరవం చాలా ముఖ్యం. డబ్బు కావాలంటే కేవలం సినిమానే చేయాల్సిన అవసరం లేదు. నేను ఇదే ఫీల్డ్ ని నమ్ముకుని 18 ఏళ్లుగా ఉన్నాను. ఎన్నో సినిమాలని చేశాను. బాగా నటించానని ప్రశంసలు వచ్చాయి. అది నాకు చాలా సంతృప్తిని ఇస్తాయి. ఇటీవలే రిలీజ్ అయిన దండోరా సినిమా విషయంలో వచ్చిన ప్రశంసలు నాకు ఎంతో గొప్ప ఉత్సాహం ఇచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలో సోలో హీరోగా చేస్తున్నాను. నేను సోలో హీరోగా కూడా నిలదొక్కుకోగలుగుతానో అనే ప్రశంస వస్తే మళ్లీ ఒక కొత్త ఊపిరి అందుతుంది. మరో 10 ఏళ్లు పరిగెట్టడానికి ఉత్సాహం దొరుకుతుంది.
డైరెక్టర్ వరుణ్ గురించి?
వరుణ్ కి నాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. నిజానికి నేను వేరే కథతో సినిమా చేయాలని భావించాను. కానీ తన చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. అలా మా జర్నీ మొదలైంది. చాలా క్రియేటివ్ ఫ్రీడంతో ఈ సినిమా చేశాం. ప్రతిదీ చర్చించుకుని అందరికీ నచ్చిన తర్వాతే చేసేవాళ్లం.
ఇండస్ట్రీలో ఈ సినిమాని ఇప్పుడు వరకు ఎంత మంది చూశారు?
రాఘవేంద్రరావు గారు, సాయి రాజేష్ గారు, అనుదీప్ గారు, నిమ్మకాయల ప్రసాద్ గారు.. చాలా మంది చూశారు. అందరు కూడా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. ముఖ్యంగా రాఘవేంద్రరావు గారికి ఈ సినిమా విపరీతంగా నచ్చింది. అది చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది.
ఈ సినిమా కోసం రానా గారితో ఎక్కువ ప్రమోషన్స్ చేశారు కదా?
రానా గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయన ప్రమోషన్స్ కోసం చాలా కష్టపడ్డారు. దాదాపు పది వీడియోలు చేశాం. రానా గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి పోయే వాళ్ళం. ఆయన మాకు ఎంతగానో సహకరించారు. ఆయన సపోర్ట్ ని మర్చిపోలేము.
-ఈ సినిమా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని చెప్పాను కదా. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ రానా బాబు, సెకండ్ హాఫ్ సురేష్ బాబు (నవ్వుతూ)
యామిని క్యారెక్టర్ గురించి?
తను చాలా మంచి క్లాసికల్ డాన్సర్. తెలుగుదనం ఉన్న అమ్మాయి. ఈ సినిమాకి చాలా బరువైన ఫీలింగ్ ఉండే అమ్మాయి కావాలి. తనను చూసినప్పుడు ఆ ఫీలింగ్ కలిగింది. డైరెక్టర్ వరుణ్ ఈ కథ చెప్పిన తర్వాత ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యింది. తను క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ యాప్ట్.
ఒక నటుడిగా ఈ సినిమా మీకు ఎలాంటి అనుభూతినిచ్చింది?
ఈ సినిమా చూసిన తర్వాత నందు ఇంత ఓపెన్ గా చేయగలడా? అని ఆడియన్స్ అంటారని నా నమ్మకం. చాలా వైల్డ్ గా ఓపెన్ చేసిన క్యారెక్టర్ ఇది.
2025 ఎలా ఉంది?
-చాలా బాగుంది. నేను చేసిన ఫస్ట్ ప్రొడక్షన్ రానా గారు సురేష్ బాబు గారు బయటికి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది .అలాగే దండోరా సినిమాలో అద్భుతమైన పేరు వచ్చింది. 2026 కూడా అద్భుతమైన ఓపెనింగ్ అవుతుందని భావిస్తున్నాను.
-నాకు న్యూ ఇయర్ ప్లానింగ్ అంటూ పెద్దగా ఏమీ ఉండవు. ఈ న్యూ ఇయర్ మాత్రం సైక్ సిద్ధార్థ ప్రమోషన్స్ తో బిజీగా ఉండబోతున్నాం.
ఈ కొత్త సంవత్సరం రిజల్యూషన్ ఏమిటి?
-మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. సినిమా చేసిన ప్రొడ్యూసర్ కి బ్రేక్ ఈవెన్ అయిపోవాలని జోన్ లో ప్రయత్నిస్తాను.
కొత్తగా చేస్తున్న సినిమా గురించి?
-నేను వెన్నెల కిషోర్ వైవా హర్ష కలిసి ఒక సినిమా చేస్తున్నాం. అనిల్ రావుపూడి గారి దగ్గర రైటర్ గా పనిచేసిన ప్రవీణ్ ఈ సినిమాకి దర్శకుడు. 17 జనవరి నుంచి ఈ సినిమా స్టార్ట్ కాబోతోంది.






