NJ-India Commission Members: న్యూజెర్సీ గవర్నర్ మికీ షెర్రిల్ టీమ్ లో భారతీయ అమెరికన్లు..
న్యూజెర్సీ గవ్నరర్ గా ఎన్నికైన మికీ షెర్రిల్ టీమ్.. తన బృందంలో నలుగు ఇండో అమెరికన్లకు చోటిచ్చారు. ఇది ఇండో అమెరికన్ కమ్యూనిటీకి ఆనందాన్నిస్తోంది.కొత్త గవర్నర్ మికీ షెర్రిల్ భారతీయ అమెరికన్లతో సంబంధం బలపడుతుందని న్యూజెర్సీ-ఇండియా కమిషన్ ఆశిస్తోంది. ఇది ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సమర్థత, రాజకీయ ప్రాముఖ్యతకు అద్దం పడుతోందని న్యూజెర్సీ-ఇండియా కమిషన్ తెలిపింది. గవర్నర్ టీమ్ లో చోటు సంపాదించుకున్న నలుగురు ఇండో అమెరికన్లను ప్రశంసించింది. వారి ఎంపిక.. తమకు గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేసింది.
కొత్త న్యూజెర్సీ గవర్నర్ మికీ షెర్రిల్ పాలన .. భారతీయ- అమెరికన్ సమాజం మధ్య బంధం మరింత బలోపేతమవుతుందని న్యూజెర్సీ-ఇండియా కమిషన్ అభిప్రాయపడింది.గవర్నర్ బృందంలో సహాయకులైన డిని అజ్మానీ, కిరణ్ హండా గౌడియోసో, అమిత్ జానీ, మరియు డాక్టర్ గుర్బీర్ ఎస్. జోహల్.. “కొత్త పరిపాలన ..ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీతో బంధాన్ని మరింత బలోపేతం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేసింది..
తమ సభ్యుల నాయకత్వ రికార్డులను ప్రశంసిస్తూ, కొత్త పరిపాలన ప్రారంభం నుండే ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ యొక్క ప్రత్యేక ప్రాధాన్యతలను సమర్థించుకునేలా చూస్తామని కమిషన్ తెలిపింది.”ఈ కీలక పాత్రలను స్వీకరించినందుకు డిని, కిరణ్, అమిత్ మరియు డాక్టర్ జోహల్ లను అభినందిస్తున్నామని NJ-ఇండియా కమిషన్ చైర్మన్ వెస్లీ మాథ్యూస్ అన్నారు.
షెర్రిల్ టీమ్ లో భారతీయ అమెరికన్ల ఎంపిక ..న్యూజెర్సీ ఆర్థిక మరియు సాంస్కృతిక ప్రయాణానికి, భారతీయ అమెరికన్ సమాజం యొక్క కీలకమైన సహకారానికి గుర్తింపుగా అభివర్ణించారు మాథ్యూస్. ఇది మన రాష్ట్ర ప్రభుత్వంలో దక్షిణాసియా ప్రాతినిధ్యం కోసం ఒక గొప్ప ముందడుగు.”ఈ నియామకాలు న్యూజెర్సీ భవిష్యత్తును రూపొందించడంలో ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ యొక్క పెరుగుతున్న పాత్ర మరియు బాధ్యతను ప్రతిబింబిస్తాయి” అని NJ-ఇండియా కమిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్‌పాల్ ఎస్. బాత్ అన్నారు.పాలనలో కొత్త సభ్యుల భాగస్వామ్యం ప్రజా సేవ, ఎకనమిక్ లీడర్ షిప్ మరియు సమాజాభివృద్ధికి దోహద పడుతుందని వివరించారు.”






