తెలంగాణ హోంమంత్రి కి కరోనా…
తెలంగాణ లో కరోనా విశ్వరూపం దాల్చుతోంది. ఇప్పటికే రోజుకి దాదాపు సగటు కేసుల.సంఖ్య.1000కి చేరుకొంటుండగా… మరోవైపు అత్యంత సురక్షితమైన పరిస్థితి లో ఉండే ప్రముఖులు, రాజకీయ నేతలను కూడా కరోనా వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ వి.హెచ్ వంటి వారూ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కి.సైతం సోమవారం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
గత కొన్ని రోజులుగా స్వల్ప అనారోగ్యంతో హోమ్.క్వారంటైన్ లో ఉన్న ఆయనకు గత రాత్రి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి కి కొన్నిరోజులుగా సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి వారినీ.క్వారంటైన్ కి తరలిస్తున్నారు. ఇదిలా ఉండగా గత 25 వ తేదీన హోంమంత్రి గన్ మెన్లు 5 గురు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయి ప్రస్తుతం చికిత్స పొందుతుండడం. గమనార్హం.






