తెలంగాణ డిప్యూటీ స్పీకర్ కు కరోనా
తెలంగాణలో కరోనా వైరస్ సాధారణ ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ నేతలకు కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇటీవల హోంశాఖ మంత్రి మమమూద్ అలీకి కరోనా సోకగా, తాజాగా తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. మూడు రోజుల నుంచి జ్వరం గొంతునొప్పితో బాధపడుతున్న ఆయనకు వైద్యలు పరీక్షలు నిర్వహించారు. పద్మారావుతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులు సైతం కోవిడ్ బారిన పడ్డారు. వీరంతా ప్రస్తుతం సికింద్రాబాద్‌లో హోం క్వారంటైన్లో ఉన్నారు.






