అక్టోబర్ నాటికి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్
కరోనా మహమ్మారి నుంచి మానవాళిని రక్షించే టీకా త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో దీని కోసం కొనసాగుతున్న ప్రయోగాల్లో చాలా మంచి ఫలితాలు వచ్చాయని అక్కడి జెన్నిఫర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్, ఆ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న ఆడ్రియన్ హిల్ వెల్లడించారు. చింపాంజీలపై తమ టీకా బాగా పనిచేసిందని, చివరి దశలో భాగంగా మానవులపై ప్రయోగాలకు సన్నాహాలను పూర్తి చేసుకున్నట్లు ఆయన తెలిపారు. తాము ఆశిస్తున్న విధంగా ఈ ఫలితాలు వస్తే ఆగస్టు లేదా సెప్టెంబరుకు టీకా సిద్ధమవుతుందని, అక్టోబరు కల్లా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురాగలమని ప్రొఫెసర్ హిల్ వెల్లడించారు.






