ఇది ఎక్కడ అడుగుపెడితే… అక్కడ వ్యాప్తి
ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ రకాన్ని గుర్తించినట్లు అమెరికాలోని లాస్ అలమోస్ నేషనల్ లేబొరేటరీ, బ్రిటన్‌లోని షెఫీల్డ్ శాస్త్రవేత్తల సంయుక్త బృందం వెల్లడించింది. డీ614జీ రకం కొవిడ్ 19 వైరస్ ఇన్ఫెక్షన్ను వ్యాప్తి చేయడం లో కరోనా కుటుంబంలోని ఇతర రకాల వైరస్ల కంటే ప్రమాదకరంగా పరిణమిస్తోందని తెలిపారు. ఇది ఎక్కడ అడుగుపెడితే అక్కడ వ్యాప్తిరేటులో ఇతర రకాల వైరస్‌లను అవలీలగా అదిగమిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో సింహభాగం డీ 614జీ రకం వైరస్‌తో ముడిపడినవేనని వేలాది కొవిడ్ జన్యుక్రమాల విశ్లేషణలో గుర్తించామన్నారు.






