ఐదు రాష్ట్రాలకు తొలి కరోనా ఇంజక్షన్
కరోనా కట్టడి చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ జెనెరిక్ ఫార్మాస్యూటికల్ కంపెనీ హెటిరో సంస్థ రూపొందించిన రెమ్డిసివియర్ ఔషధాన్ని ముందుగా అయిదు రాష్ట్రాలకు పంపించారు. కోవిఫర్ పేరుతో జనరిక్ మందు అమ్మకానికి ఇటీవల గ్రీన్‌సిగ్నల్ లభించగా, భారత్‌లో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న ముంబై, ఢిల్లీ వంటి నగరాలతో పాటు తమిళనాడు, గుజరాత్, హైదరాబాద్ నగరాలకు 20,000 వేల ఇంజక్షన్లను అందించినట్లు హెటిరో తెలిపింది. రెండో విడత కింద కోల్‌కతా, ఇండోర్, భోపాల్, లక్నో, పాట్నా, భువనేశ్వర్, రాంచీ, విజయవాడ, కొచ్చి, త్రివేండ్రం, పణజి నగరాలకు పంపనున్నట్లు పేర్కొంది. కొవిఫర్ పంపిణీ ప్రభుత్వం, ఆస్పత్రుల ద్వారా మాత్రమే జరుగుతుందని, మార్కెట్లో కొనుగొలు చేసేందుకు లభించదని హెటిరో తెలిపింది. అత్యవసర స్థితిలో ఉన్న కొవిడ్ బాధితుల చికిత్సలో మాత్రమే కొవిఫర్‌ను వాడనున్నారని సంస్థ తెలిపింది. ఒక్కో కొవిడ్ రోగికి కనీసం ఆరు మోతాదులు అవసరమని, 100 మిల్లీగ్రాముల మోతాదు రూ.5400 అని సంస్థ వెల్లడించింది.






