తెలుగు రాష్ట్రాల్లో మరోసారి లాక్డౌన్ తప్పదా?
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మరోసారి లాక్డౌన్ ప్రకటించక తప్పే పరిస్థితి కనిపించడం లేదు. వైరస్ భారినపడుతున్న వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 920 కేసులు నమోదు అవగా, మొత్తం కేసులు 11 వేలకు చేరగా, ఆంధప్రదేశ్‌లో 533 కేసుల నమోదు అయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 10,884 చేరాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేసుల సంఖ్య కొంత తక్కువగా ఉన్నా వైరస్ వ్యాప్తిని నిలువరించకపోతే తెలుగు రాష్ట్రాలు అదే స్థాయికి చేరుకోక తప్పదని కనినిపిస్తోంది. లాక్ డౌన్ విషయంలో కేంద్ర రాష్ట్రాలకు అధికారాన్ని ఇచ్చేసింది. స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని వెల్లడించింది. దీంతో కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న రాష్ట్రాలు లాక్డౌన్ విధిస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధప్రదేశ్, తెలంగాణలలో కూడా మరోసారి లాక్డౌన్ విధించడంతో వైరస్ వ్యాప్తిని నివారిస్తే పరిస్థితి కొంత వరకూ అదుపులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు సైతం భావిస్తున్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కోలుకున్న వారి సంఖ్య యాక్టివ్ కేసులు సంఖ్యకు వ్యత్యాసం రోజు రోజకూ పెరుగుతుంది.






