రేపటి నుంచే కూత పెట్టనున్న రైళ్లు…
దాదాపు 50 రోజుల తర్వాత సాధారణ రైళ్లు కూతపెట్టనున్నాయి. లాక్‌డవున్‌ను ఈ నెల 17 వరకూ పొడిగించిన కేంద్రం… అంతకంటే ముందుగానే రైళ్ల రాకపోకలకు తొలిదశ జెండా ఊపింది. ఈ నెల 12వ తేదీ నుంచి భారతీయ రైల్వే పాసింజర్ రైళ్లు నడపనుంది. ఈ రైళ్లలో ప్రయాణించాలనుకునేవారు సోమవారం సాయంత్రం నుంచి ఐఆర్సిటిటి ద్వారా ఆన్లైన్లో టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. కరోనా లక్షణాలు లేనివారికే అనుమతి ఇస్తారు. ఢిల్లీ నుంచి ముఖ్య నగరాలకు 15రైళ్లు నడపనున్నారు. సికింద్రాబాద్, చెన్నై, బెంగుళూర్, ముంబై సెంట్రల్, జమ్ముతావి, అగర్తలా, భిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, తిరువనంతపురం, అహ్మదాబాద్… నగరాలు ఇందులో ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం నేరుగా ఏ రైలూ లేదు. రైలు బయలుదేరే ముందే స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలి. సర్టిఫికెట్ ఉన్నవారినే ప్లాట్‌ఫామ్ మీదకు అనుమతిస్తారు.






