దేశంలో.. 50 వేలకు చేరువలో కరోనా మరణాలు
ఆదివారం ఉదయానికి దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 49,980కు చేరింది. ఇక ఆదివారం నమోదయే వాటితో కలిపి 50వేలకు దాటడం లాంఛనమే కానుంది.కొవిడ్ మరణాల్లో భారత్ ప్రపంచంలోనే నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఒక్క రోజులోనే 944మంది కరోనా పాజిటివ్ తో మృతి చెందారు. రోజువారీ సగటు మరణాల సంఖ్య కూడా 1000కి చేరే అవకాశం కనపడుతోంది. గత 24గంటల్లో కొత్తగా మరో 63,490 పాజిటివ్ కేసులు నమోదు కాగా దీంతో మొత్తం కేసులసంఖ్య 25,89,682కు చేరింది.గడిచిన 24 గంటల్లో 53వేల మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మొత్తంగా చూస్తే ఇప్పటివరకు 18లక్షల 62వేల మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 6లక్షల 77వేల క్రియాశీల కేసులకు
పెరుగుతున్న రికవరీ…
కేసుల సంఖ్యతో పాటే కోలుకుంటున్న రోగుల శాతం కూడా పెరుగుతుండడం ఆశావాహ పరిణామం. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 71శాతంకి చేరుకుంది. అదే సమయంలో మరణాల రేటు దాదాపు 1.9శాతంగా ఉంది.






