కరోనా టీకా పై …ఐసీఎంఆర్ కీలక ప్రకటన
భారత్ బయోటెక్ టీకా ప్రయత్నాలపై భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాల మేరకే కరోనా వ్యాక్సిన్ తయారీ, పరీక్షలు నిర్వహిస్తామని సృష్టం చేసింది. దేశీయంగా వ్యాక్సిన్ తయారీకి భారత్ బయోటెక్‌కు అనుమతి ఇచ్చామని.. ఐసీఎంఆర్, నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి ఆ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తోందని పేర్కొంది. దేశ ప్రజల ప్రయోజనాలు, భద్రతను దృష్టిలో పెట్టుకొని వేగవంతంగా వ్యాక్సిన్ తయారీ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. లోతైన పరిశీలన, డేటా విశ్లేషణ తర్వాతే కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌కు అనుమతిస్తామని సృష్టం చేసింది.






