కరోనా హాట్ స్పాట్‌గా అరిజోనా
అమెరికాలో మళ్ళీ కోవిడ్ 19 కేసులు బాగా పెరుగుతున్నాయి. అరిజోనా రాష్ట్రం కరోనా హాట్ స్పాట్‌గా మారింది. మొత్తం ఐసీయూలు నిండిపోయాయని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. దీనిని ఆల్‌టైం రికార్డుగా తెలిపాయి. గురువారం ఒక్కరోజే 3 వేల పైచిలుకు, శుక్రవారం 4 వేల పైచిలుకు జనాభాకు పాజిటివ్ వచ్చిందని అరిజోనా ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 92 వేలకు చేరిందని తెలిపింది. మరోపక్క, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడి స్నేహితురాలు కింబెర్టీ గుల్ఫియోల్కి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె హోమ్ క్వారంటైన్ అయ్యారు. ఈ క్రమంలో జూనియర్ ట్రంప్‌నకు కూడా కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, నెగిటివ్ వచ్చింది. అయినా ఆయన హోం క్వారంటైన్ అయ్యారు. న్యూయార్క్‌లో శుక్రవారం ఒక్కరోజే 918 కొత్త కేసులు నమోదయ్యాయి.






