రెమ్డెసివిర్ కోవిడ్ మందు ధర 2,340 డాలర్లు
కోవిడ్ రోగులు త్వరితగతిన కోలుకోవడానికి వినియోగించే మందు రెమ్డెసివిర్ ధర 2,340 డాలర్లుగా అమెరికా ఫార్మా దిగ్గజం గిలీడ్ సైన్సెస్ నిర్ణయించింది. అమెరికా, ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద కరోనా చికిత్సకు 2,340 డాలర్లు వసూలు చేస్తామని, అదే ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థల ద్వారా చికిత్స పొందితే రెమ్డెసివర్ ధర 3,120 డాలర్లు ఉంటుందని గిలీడ్ తెలిపింది. అమెరికా, ఇతర దేశాలకు గిలీడ్ సైన్సెస్ ఇప్పటికే 2,50,000 డోసుల్ని అందించింది. వచ్చే వారం నాటిక అవన్నీ అయిపోతాయని, ఇక మీదట రెమ్డెసివర్ అవసరమయ్యే కోవిడ్ రోగులు వాటిని కనుక్కోవాల్సి ఉంటుందని గిలీడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాన్ ఓడే చెప్పారు.






