రైల్వే ప్రయాణికులకు తీపికబురు
ఎప్పుడెప్పుడు సొంతూళ్లకు వెళ్లాలా అని ఎదురుచూస్తున్న వారికి భారతీయ రైల్వే కూత పెట్టి మరీ తీపికబురు చెప్పింది. ఈ నెల 12న (మంగళవారం) నుంచి రైల్వే సర్వీసులను పునరుద్ధరించనున్నట్టు ప్రకటించింది. అయితే ఇది క్రమపద్ధతిలో ఉంటుందని, తొలుత 15 జతల (30 తిరుగు ప్రయాణాలు) ఏసీ రైళ్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది. న్యూఢిల్లీ, నుంచి దిబ్రూగఢ్, అగర్తల, హౌరా, పట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడగావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావి స్టేషన్లను కలుపుతూ ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. తదుపరి మరిన్ని కొత్త మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది. కరోనా కేర్ సెంటర్లుగా ఇప్పటికే 20 వేల కోచ్‌లను భారతీయ రైల్వే వినియోగిస్తోంది. అలాగే రోజుకు 300 వరకు రైళ్లను వలస కూలీల కోసం ప్రత్యేకంగా శ్రామిక ఎక్స్‌ప్రెస్‌ల పేరుతో నడుపుతోంది. ఇవిపోను అందుబాటులో ఉన్న రైళ్లను తదుపరి మరిన్ని కొత్త మార్గాల్లో నడపనున్నట్టు తెలిపింది.






