సెవెన్ సీస్ ఎంటర్టైన్మెంట్స్, తెలుగు టైమ్స్ ఆధ్వర్యంలో కరోనా నివారణ కోసం హోమియో మందుల ఉచిత పంపిణీ
దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ మహమ్మారి విజృభిస్తున్న తరుణంలో ప్రజల్లో ఇమ్యూనిటీపై ఆసక్తి పెరిగింది. అదే సమయంలో కోవిడ్19 నుంచి రక్షణకోసం అవసరమైన మందులను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో క్లినికల్ రీసెర్చ్ రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ మోహన్ లాల్ శాయన సహకారంతో కరోనా వైరస్ రాకుండా తోడ్పడే హోమియో మందులను అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు హైదరాబాద్ నగరానికి చెందిన సెవెన్ సీస్ ఎంటర్టైన్మెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ లింగంనేని మారుతీ శంకర్ తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 25 వేలమందికి మందులను పంపిణీ చేశామన్నారు. ఇదే స్ఫూర్తితో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛతీస్ఘడ్ రాష్ట్రాల్లోనూ కోవిడ్ -19 హోమియో మందును పంపిణీ చేయనున్నట్లు మారుతీ శంకర్ చెప్పారు. హోమియో మందు ఉచిత పంపిణీ కార్యక్రమానికి చేయూతనందిస్తున్న వారికి డాక్టర్ మోహన్‌లాల్ శాయన అభినందనలు తెలిపారు. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్షతో హోమియో మందులను పంపిణీ చేయడం అభినందనీయమని ప్రముఖ న్యాయవాది కేవీఎస్ రామచంద్రరావు తెలిపారు. ఈ విషయంలో తన వంతు సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
వివిధ దేవాలయాల అర్చకులకు హోమియో మందుల పంపిణీ
డా. మోహన్ శాయన గారి సహకారం తో వివిధ దేవాలయాల్లో కోవిడ్ నివారణ హోమియో మందులు ఉచితంగా పంపిణి చేస్తున్నట్లు మారుతి శంకర్ తెలిపారు. హాస్పిటల్స్ లాగానే దేవాలయాలు కూడా కోవిడ్ సమయంలో భక్తుల కోసం తెరిచి ఉంచటం వలన పూజారులకు కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వారికి కూడా ఈ హోమియో మందు ఇస్తే బావుంటుందని భావించామన్నారు. తెలుగు టైమ్స్ ఎడిటర్ సుబ్బారావు చెన్నూరితో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన పద్మావతి అమ్మవారి గుడి, తిరుచానూరు, కనకదుర్గ టెంపుల్, విజయవాడ, సత్యనారాయణ స్వామి గుడి, అన్నవరం, శ్రీ వెంకటేశ్వర టెంపుల్, ద్వారకా తిరుమలను సంప్రదించి, ఆయా గుడిలో ఉన్న పూజారుల సంఖ్య కనుక్కొని వెంటనే హైదరాబాద్ నుంచి కోవిడ్ నివారణ కోసం తయారు చేసిన హోమియో మందులను పంపటం, వాటిని అక్కడ పూజారులకు పంచటం జరిగిందని మారుతీ శంకర్ వివరించారు. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి, లిబర్టీ, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి, శ్రీనగర్కాలనీలలో కూడా ఈ మందులు పంచటం జరిగింది. తాము ఇంకా శ్రీకాళహస్తి, కాణిపాకం, సింహాచలం, యాదాద్రి దేవాలయాలను సంప్రదిస్తున్నామని వారికి కూడా అందిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇప్పటికే ఈ మందులు పంపిణి చేసిన శ్రీశైలం, అమరావతి, మోపిదేవి, శ్రీకాకుళ మహావిష్ణు దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు తమ అభినందనలు తెలియజేశారని, విజయవాడ కనక దుర్గ దేవాలయ ముఖ్య అర్చకులు శ్రీ శంకర్ శాండిల్య, అన్నవరం దేవాలయ అర్చకులు శ్రీ రవి శర్మ, తిరుచానూరు దేవాలయ ముఖ్య వేద పండితులు శ్రీ చంద్రమౌళి, భద్రాచల దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ సీతారామానుజ అచార్యులు, హైదరాబాద్ టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడి లో శ్రీ ప్రహ్లాదాచార్యులు, శ్రీనగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి లో ముఖ్య అర్చకుల ద్వారా ఈ హోమియో మందులను పంపిణీ చేశామన్నారు.
అన్ని దేవాలయాలలో అర్చకులు హాస్పిటల్ లో వైద్య సిబ్బందిలాగా కరోనాకి ఎక్సపోజ్ అవుతున్నారు. వారికి ఉచితంగా కరోనా మందు పంచాలనుకోవటం, ఆ కార్యక్రమంలో నేను కూడా ఒక పాత్ర పోషించటం సంతోషంగా ఉంది అని తెలుగు టైమ్స్ ఎడిటర్ శ్రీ సుబ్బారావు చెన్నూరి అన్నారు. ఈ పంపిణి ఏర్పాట్లలో వివిధ రకాలుగా సహాయం అందించిన దర్శకులు శ్రీ ఎ. కృష్ణారెడ్డి, శ్రీమతి సునీత దేవభక్తుని, సినీ రచయిత శ్రీ కిరణ్, సోషల్ ఆక్టివిస్ట్ శ్రీ ఫిరోజ్, శ్రీ సాయి కృష్ణ, శ్రీమతి ఆశారాణి మందాడలకు సుబ్బారావు, మారుతీ శంకర్ ధన్యవాదాలు తెలిపారు.






