మే 17 తర్వాత విమాన సర్వీసులు
కరోనా మహమ్మారి కారణంగా విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు వేయడంతో విమానాలకు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. వైరస్ కట్టడికి కేంద్రం విధించిన లాక్డౌన్ మే 17తో ముగియనుంది. ఈ నేపథ్యంలో మే 17 తర్వాత విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది. విమానాలు నడిపేందుకు సివిల్ ఏవియేషన్ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లను పరివీలించారు. కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి రానందున నాలుగో వంతు విమానాలు నడిపే అవకాశం కనిపిస్తోంది. రెండు గంటల కంటే తక్కువ ప్రయాణ సమయం ఉన్న విమానాల్లో తినుబండారాల సరఫరా అనుమతి ఇవ్వకూడదని కేంద్ర విమానయాన శాఖ నిర్ణయించినట్లు సమచారం.
అలాగే ప్రయాణికులు, ముఖాలకు మాస్క్‌తో పాటు ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా లాక్డౌన్ చేసుకోవాలని పలు మార్గదర్శకాలను సైతం రూపొందిస్తోంది. మాన ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాలపై కేంద్రం అధికారిక ప్రకటనను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. అయితే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో కేవలం గ్రీన్, ఆరెంజ్ జోన్లకే అనుమతులు ఇస్తారా లేక మొత్తంగా అనుమతి మంజూరు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.






