అన్నదాత…దంటు నాగార్జున శర్మ కన్నుమూత
వేద నిలయం స్పిరిట్యుయల్ టూర్స్ అధినేత, అన్నదాత, ఇంప్రింట్స్ దంటు నాగార్జున శర్మ కరోనా తో కనుమూశారు! వేలాది మంది భక్తులను తీర్థ యాత్రలకు తీసుకెళుతూ గత కొన్నేళ్లుగా హైదరాబాద్లోని ముషీరాబాద్ కేంద్రంగా తన కార్యాలయంలో కళాకారులకు, జర్నలిస్ట్ మిత్రులకు మధ్యాహ్న భోజనం తనే స్వయంగా వండి పెట్టి మంచి మనసున్న మనిషి అనిపించుకున్న నాగార్జున శర్మ గారు ఇలా అర్ధాంతరంగా కనుమూయడం విచారకరమని పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అఖిల భారత హిందూ మహాసభ తెలంగాణ అధ్యక్షులుగా కూడా ఆయన విశేష సేవలు అందించారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండే ఆయన మృతిపట్ల తెలుగు టైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావు కూడా సంతాపం వ్యక్తం చేశారు.






