కరోనా ముప్పున్న ప్రాంతాలు గుర్తించే పరిజ్ఞానం
కరోనా కట్టడికి భౌతిక దూరమే ప్రాథమిక ఆరోగ్య సూత్రం. ఈ దూరం చెరిగిపోయే జనసమ్మర్ధ ప్రదేశాలను గుర్తించి, స్థానిక అధికారులకు సమాచారాన్ని చేరవేయగలిగే సరికొత్త పరిజ్ఞానాన్ని అమెరికాలోని కొలరాడో స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది సెల్యూలార్ వైర్లెస్ నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తూ, కరోనా వ్యాప్తికి అధిక అవకాశాలున్న హాట్స్పాట్లను గుర్తిస్తుంది. ఇతరత్రా అవసరాల నిమిత్తం టెలికాం కంపెనీల వద్ద నిక్షిప్తమయ్యే సెల్ఫోన్ వినియోగదారుల కదలికల సమచారం ప్రాతిపదికగా కరోనా ముప్పు పొంచి ప్రాంతాల వివరాలను సేకరించడమే ఈ పరిజ్ఞానం ప్రత్యేకత.






