నవంబర్ లో కరోనా రెండోదశ
ప్రస్తుత తరుణంలో కరోనా వ్యాప్తి కొంతవరకు తప్పదని, అయితే దానికి భయపడాల్సిన అవసరం లేదని అమెరికా చికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం ఆచార్యుడు, వ్యాధుల నివారణ కేంద్ర (సీడీసీ) నిపుణుడు డాక్టర్ విజయ్ ఎల్దండి తెలిపారు. జులై, ఆగస్టు వరకు అది పతాక స్థాయికి చేరుకుని తగ్గుముఖం పడుతుందని, తర్వాత తిరిదగి నవంబరు నెలలో రెండో దశ ప్రభావం చూపుతుందని వెల్లడించారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కరోనాపై విస్తృతంగా చర్చించారు. విజయ్ మాట్లాడుతూ కరోనా అంటేనే ప్రజలు భయపడుతున్నారు. కానీ ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. లాక్డౌన్ ఎత్తివేతకు, కరోనా కేసులు పెరగడానికి సంబంధమే లేదు. కొవిడ్ ప్రభావం ఏ స్థాయిలో ఉన్నా భయపడవద్దు. మాస్క్‌లు విధిగా ధరించి, భౌతిక దూరం పాటిస్తే కొవిడ్ బారిన పడే ప్రమాదం తగ్గుతుందని అని విజయ్ వివరించారు.






