24 గంటల్లో 4213 పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వైరస్ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా నియంత్రణ మాత్రం సాధ్యం కావడం లేదు. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 4213 పాజిటివ్ కేసులు నమోదు కాగా 97 మంది మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 67,125కి, మృతుల సం•్య 2206కి చేరింది. అలాగే ఇప్పటివరకు 20,917 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం 44,029 యాక్టివ్ కేసులు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బుటెటిన్ విడుదల చేసింది.






