10 రోజులకే డబుల్
దేశంలో కరోనా కేసులు రెట్టింపు ఆందోళన కలిగిస్తున్నది. నెల ప్రారంభంలో కేసులు రెట్టింపు అయ్యేందుకు 13 రోజులు పట్టాగా ప్రస్తుతం 10 రోజులకే రెట్టింపు అవుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి పరిశీలిస్తే ప్రతిరోజు దాదాపు 3000 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా మహారాష్ట్ర రాజధాని ముంబై, తమిళనాడు రాజధాని చెన్నైలో కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో (శుక్రవారం నుంచి శనివారం వరకు) దేశంలో 3,320 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 59,662కు చేరుకుంది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 1,981 కి పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా పరిస్థితి ఉన్నట్లు మన దగ్గర ఉండొకపోవచ్చని తెలిపారు.






