మళ్లీ లాక్ డౌన్ తప్పదా?
దేశంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. రోజుకు 20 వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. ప్రధాన నగరాలు కరోనా హాట్స్పాట్లు మారిపోతున్నాయి. చెన్నై, ఢిల్లీ, ముంబై, పుణే, హైదరాబాద్, అహ్మదాబాద్‌లలో కరోనా విలయం సృష్టిస్తోంది. దీంతో ఇపుడు దేశ వ్యాప్తంగా మళ్లీ లాక్ డౌన్ తప్పదన్న మాటలు వినిపిస్తున్నాయి. నిజానికి రేపటితో ఆన్ లాక్ 1.0 ముగియనుంది. ఇప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? మళ్లీ లాక్ డౌన్ వైపు మొగ్గుచూపుతుందా? అనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు రాష్ట్రాలు మాత్రం సొంతంగా లాక్ డౌన్ విధించుకోవాలన్న దిశగా ఆలోచిస్తున్నాయి.






