ఏపీలో కొత్తగా 9,996 పాజిటివ్ కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,996 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 55,692 నమూనాలు పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బులిటెన్లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 90,840 యాక్టివ్ కేసులు ఉండగా, 1,70,924 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఒక్క రోజులో 9,4999 మంది కోలుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 27,05,459 నమూనాలను పరీక్షించినట్లు తెలిపింది. తాజా కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా నుంచి 1,504 పాజిటివ్ కేసులు వచ్చాయి.
తాజాగా కరోనాతో 82 మంది మృతి చెందారు. తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 10 మంది, అనంతపురం జిల్లాలో 8 మంది, కడప జిల్లాలో 7 మంది, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో 6 మంది, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 5 మంది, కృష్ణా జిల్లాలో ఒకరు చొప్పున మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 2,378కి చేరింది.






