తెలంగాణలో కొత్తగా 1931 పాజటివ్..
తెలుగు రాష్ట్రాల్లో కొరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తెలంగాణంలో కొత్తగా గడిచిన 24 గంటల్లో 1931 కొరొనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో కలిపి మొత్తం ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 86 475 కి చేరింది. గడచిన 24గంటల్లో కొత్తగా 11 కొరోనా మరణాలు సంభవించగా, ఇప్పటి వరకూ మొత్తం మరణించిన వారి సంఖ్య 665 కి చేరింది. డిచిన 24 గంటల్లో రికవరీ అయిన వారు 1780 కాగా మొత్తం ఇప్పటి వరకు 63 074 మంది కొరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 22736. గడచిన 24గంటల్లో జిహెచ్ఎంసి పరిధిలో 293, వరంగల్ అర్బన్-144, రంగారెడ్డి-124, మేడ్చెల్-71, పెద్దపల్లి-64, నల్గొండ-84, సంగారెడ్డి-86, ఖమ్మం-73, కరీంనగర్-89 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.






