Dallas: రాష్ట్ర ప్రగతిలో మంత్రి నారా లోకేష్‌కు అండగా నిలుస్తాం… డల్లాస్ సభలో జయరామ్ కోమటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడుకు తోడుగా రాష్ట్ర ప్రగతికోసం నిరంతరం పాటుపడుతున్న ఆంధ్రుల ఆశాజ్యోతి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇక్కడకు రావడం చాలాసంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రగతికోసం పెట్టుబడులు తేవాలన్న లక్ష్యంతో ఆయన అమెరికా పర్యటన పెట్టుకున్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడకు రావడం, మనల్నందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వం ఎంతో దుర్మార్గంగా వ్యవహరించినప్పటికీ లక్ష్యపెట్టక, పార్టీ శ్రేణులకోసం, ప్రజా సమస్యల పరిష్కారంకోసం ఆయన రాష్ట్ర నలుమూలలా చేపట్టిన యువగళం పాదయాత్రే నేడు కూటమి విజయానికి దోహదపడిరదని ఈ సందర్భంగా జయరామ్ కోమటి పేర్కొన్నారు. అమెరికాలోని తెలుగుదేశం పార్టీ ఎన్నారైలతోపాటు, కూటమి నాయకులు కూడా మంత్రి లోకేష్ కు అండగా నిలవడంతోపాటు రాష్ట్ర ప్రగతికి తామంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా జయరామ్ కోమటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికా నలుమూలల నుంచి వచ్చిన ఎన్నారై టీడిపి నాయకులు, బిజెపి అభిమానులు, జనసైనికులు పలువురు మంత్రి లోకేష్ తో కరచాలనం చేసేందుకు, ఫోటో దిగేందుకు పోటీపడ్డారు. అందరినీ లోకేష్ పలకరించి అభినందనలు తెలియజేశారు.






