ఆ ఆ ఏలియన్స్‌ని వెనక్కి తీసుకెళ్లండి : అమెరికా
కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న తమ దేశ పౌరులను వెనక్కి తీసుకువెళ్లాలని అగ్రరాజ్యం ఇరాన్‌కు విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ విమానం పంపాలని సూచించింది. ఈ మేరకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తాత్కాలిక కార్యదర్శి కెన్ క్యుసినెల్లి స్పందిస్తూ మా దేశంలో అక్రమంగా నివసిస్తున్న ఏలియన్లు, అదే మీ దేశానికి చెందిన 11 మంది పౌరులను వెనక్కి పంపాలని ప్రయత్నిస్తున్నాం. వాళ్లు స్వదేశానికి రావాలని మీరూ కోరుకుంటున్నారు కదా. కాబట్టి చార్టర్ ఫ్లయిట్ పంపిస్తే బాగుంటుందేమో. ఒకేసారి ఆ 11 మందిని పంపించేస్తాం అని ట్వీట్ చేశారు.






