TTA: ఆర్థిక అక్షరాస్యతపై టిటిఎ వర్క్‌షాప్ విజయవంతం

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) న్యూజెర్సీ బృందం పిల్లల కోసం నిర్వహించిన సరదా, ఇంటరాక్టివ్ ఆర్థిక అక్షరాస్యత వర్క్‌షాపుకు మంచి స్పందన వచ్చింది. 7-12 సంవత్సరాల వయస్సు గల 30 మంది ఉత్సాహవంతులైన పిల్లలతో జరిగిన ఈ శిక్షణలో కోరికలు వర్సెస్ అవసరాలు, పన్నులు, బడ్జెటింగ్, ద్రవ్యోల్బణం, తెలివిగా ఖర్చు చేయడం వంటి కీలక విషయాలపై ఇంటరాక్టివ్ ఆటలు, పజిల్స్ ద్వారా సులభంగా అర్థమయ్యేలా వివరించారు. హాసిక అర్కలతోపాటు టిటిఎ న్యూజెర్సీ(New Jersey) బృందం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని టిటిఎ పెద్దలు అభినందించారు.
టిటిఎ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి గారు, టిటిఎ అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారు, సలహా మండలి, కార్యనిర్వాహక కమిటీ, డైరెక్టర్ల బోర్డు సహకారంతో ఈ కార్యక్రమాన్ని న్యూజెర్సి టీటిఎ టీమ్ నిర్వహించింది. న్యూజెర్సీ కోర్ టీం, ఈవెంట్ కోఆర్డినేషన్ చేసిన శివారెడ్డి కొల్లా – జనరల్ సెక్రటరీ, నరసింహ పెరుక – ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్, సుధాకర్ ఉప్పల – టిటిఎ న్యూస్‌లెటర్ డైరెక్టర్, అరుణ్ అర్కల (బిఓడి), శ్రీని మాలీ, ఆర్‌విపిలు- ప్రశాంత్, సాయి, రాజాలకు ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.