ఆ దేశంతో వాణిజ్య సంబంధాలు కటీఫ్ : ట్రంప్
ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభానికి చైనానే కారణమంటూ విరుచుకుపడుతున్న ట్రంప్.. డ్రాగన్ దేశంతో వాణిజ్య సంబంధాలు తెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. చైనా కంపెనీల్లో అమెరికన్ పెన్షన్ ఫండ్ పెట్టిన వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని ఆదేశించినట్టు ప్రకటించారు. వేల కోట్ల డాలర్లను వెనక్కి తెప్పిస్తున్నా అని ట్రంప్ పేర్కొన్నారు. న్యూయార్క్ స్టాక్ఎక్స్చేంజ్, నాస్డాక్లోని లిస్ట్ అయిన చైనా కంపెనీల ఆదాయ లెక్కలు అడుగడంపైనా దృష్టి సారించామన్నారు. ఆలీబాబా వంటి చైనాకు చెందిన పలు కంపెనీలు న్యూయార్క్ స్టాక్ఎక్స్చేంజీలో లిస్ట్ అయ్యాయి. అయితే అమెరికా కంపెనీల మాదిరిగా అవి ఏనాడూ తమ ఆదాయాన్ని అమెరికా ప్రభుత్వానికి తెలియజేయలేదు.






