కరోనా నియంత్రణలో ట్రంప్ వైఫల్యం
కరోనా మహమ్మారిని ఎదుర్కోడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని ఆయన మొత్తం ఆర్థిక వ్యూహం అంతా ధనిక వర్గం, బడా కార్పొరేషన్ల పైనే కేంద్రీకృతమైందని డెమొక్రటిక్ పార్టీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆరోపించారు. ఏప్రిల్ ఒక్క నెలలోనే రికార్డు స్థాయిలో 2.05 కోట్ల ఉద్యోగాలు కోల్పోవడాన్ని ఉదహరిస్తూ దీపి ఫలితంగా నిరుద్యోగం అనూహ్యంగా 14.7 శాతానికి పెరిగిందని తీవ్రంగా విమర్శించారు. ట్రంప్ గత మూడేళ్లు అమెరికా ఆర్థిక మూలాలను బలహీనపర్చడంతో కరోనా వల్ల బారీ ఆర్థిక సవాలు ఎదురైందని, ఇది తీరని సంక్షోభంగా తయారైందని, సుదీర్ఘకాలం వెంటాడుతుందని ఆరోపించారు. వైరస్‌పై ట్రంప్ పొరపాటుగా స్పందించారని, ఉద్యోగాలు కోల్పోవడం, నిరుద్యోగుల సంఖ్య పెరగడం ఇవన్నీ ఇంకా ప్రారంభమేనని, ఆయన పొరపాట్ల నుంచి కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని బిడెన్ వ్యాఖ్యానించారు. చిన్న వ్యాపారాలను ఆదుకోవడానికి ఉద్దేశించిన ప్రాథమిక సహాయ నిధుల్లో 40 శాతం అసలు వ్యాపార సంస్థలకు అందడం లేదని ఆరోపించారు.






