ఈ ప్రశ్నను చైనాను అడిగితే బాగుంటుంది
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మహిళా విలేకరిపై విరుచుకుపడి అర్థంతరంగా సమావేశాన్ని ఆపి వెళ్లిపోయారు. సీబీఎస్ విలేకరి వీజే జియాంగ్ అడిగిన ప్రశ్నపై ట్రంప్ మండిపడ్డారు. కరోనాతో వేలాది మంది మరణిస్తున్నా ప్రపంచంతో పోటీ పడేలా కరోనా పరీక్షలెందుకని ట్రంప్‌ను ఆమె ప్రశ్నించారు. దీనికి ఆగ్రహించిన ట్రంప్ కరోనాతో అమెరికాలో మాత్రమే కాక ప్రపంచ దేశాల్లో ఎందరో మరణిస్తున్నారని, ఈ ప్రశ్న అడగాల్సింది తనని కాదని, చైనాను అడగండని అన్నారు. జియాంగ్‌కు రెండేళ్ల వయసు ఉన్నప్పుడు ఆమె కుటుంబం చైనా నుంచి అమెరికాకి వలస వచ్చింది. చైనాను అడగాలని తనతోనే ఎందుకు అంటున్నారని జియాంగ్ ఎదురు ప్రశ్నించడంతో ట్రంప్ అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు.






