అమెరికాకు కవసాకి దెబ్బ
ఒకవైపు కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్న అమెరికాను కవసాకి వ్యాధి కూడా భయపెడుతున్నది. కరోనా లక్షణాలతో గతవారం మరణించిన న్యూయార్క్‌కు చెందిన ముగ్గురు చిన్నారుల్లో కవసాకి లక్షణాలు కూడా కనిపించాయని అధికారులు వెల్లడించారు. మరో 85 మంది పిల్లలకు కవసాకి వ్యాధి సోకినట్లు పేర్కొన్నారు. సాధారణంగా ఈ వ్యాధి ఐదేండ్లలోపు చిన్నారుల్లో ఎక్కువగా కనిపిస్తుందని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి సోకిన పిల్లల హృదయ ధమనులు గోడల్లో మంటగా ఉంటుందని, గుండెకు చేరే రక్త ప్రవాహంలో ఆటంకాలు ఏర్పడుతాయని వివరించారు. వ్యాధి లక్షణాల్లో భాగంగా మొదటి ఐదు రోజులు తీవ్ర జ్వరం ఉంటుందన్నారు. చర్మం దురదగా ఉంటూ మెడ గ్రంథలు, చేతులు, పాదాల్లో వాపు కనిపిస్తుందని తెలిపారు. దీంతో పాటు కండ్లు ఎర్రగా మారుతాయని చెప్పారు.






