వైట్‌హౌస్‌లో మూడుకు చేరిన కరోనా కేసులు
అమెరికాలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా అమెరికాలోని వైట్‌హౌస్‌లో కరోనా కేసుల సంఖ్య మూడుకు చేరింది. అమెరికా అధ్యక్షుని కుమార్తె ఇవాంకా సహాయకురాలికి, ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ మీడియా కార్యదర్శి కేటి మిల్లర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. గడిచిన 24 గంటల్లో 1,566 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 78,746కు పెరిగినట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. 13 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో సుమారు మూడున్నర లక్షల కేసులు ఒక్క న్యూయార్క్‌లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్ తర్వాతి స్థానంలో న్యూజెర్సీ ఉంది.






