AIA: శాన్ రామోన్‌లో ఘనంగా ది గ్రేట్ ఇండియన్ ఫుడ్-షాపింగ్ ఫెస్ట్ 2025

అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో శాన్ రామోన్ నగరంలో మే 10వ తేదీ శనివారం ది గ్రేట్ ఇండియన్ ఫుడ్ అండ్ షాపింగ్ ఫెస్ట్ (TGIFS) ఘనంగా జరిగింది. ఈ ఫెస్టివల్ లో భాగంగా ఫుడ్ స్టాల్స్, షాపింగ్, డిజె మ్యూజిక్, ఇతర కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు బాలీ 92.3 ఎఫ్‌ఎం సహ-స్పాన్సర్‌గా వ్యవహరించింది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుక బే ఏరియా ప్రజలను ఎంతగానో ఆకర్షించింది.
ఈ ఫెస్టివల్ లో భాగంగా షాపింగ్ స్టాళ్ళను, ఫుడ్ స్టాళ్ళను ఏర్పాటు చేశారు. స్థానిక వ్యాపార కేంద్రాల వారితో కలిసి దుస్తులు, ఆభరణాలు, ఆర్ట్, అలంకరణ వంటి వాటితో దాదాపు 100కు పైగా షాపింగ్ స్టాళ్ళను ఏర్పాటు చేశారు. బిర్యానీ మరియు దోసల నుండి జిలేబీ, చాట్‌లు మరియు మ్యాంగో లస్సీ వరకు 20కిపైగా ఆహార స్టాళ్లతో రుచికరమైన భారతీయ ఆహార ఉత్సవం వచ్చినవారిని నోరూరించింది. జ్యూస్‌లు, డెజర్ట్‌లు మరియు తాజా రకాలతో మ్యాంగో ఫెస్టివల్ కనులవిందు చేసింది. పిల్లలు మరియు కుటుంబాల కోసం కార్నివాల్ రైడ్‌లు, ఆటలు మరియు మాయాబజార్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం వంటివి ఏర్పాటు చేశారు. నిరంతరాయంగా సాంస్కృతిక కార్యక్రమాలు, డిజె సంగీతం మరియు ఇబికె మ్యూజికల్ లైవ్ ప్రదర్శనలు కూడా వచ్చినవారిని ఉల్లాసపరిచాయి. మదర్స్ డే ను పురస్కరించుకుని ‘మామ్ అండ్ మీ’ ఫ్యాషన్ షో నిర్వహించారు. దాంతోపాటు ఈ వేడుకకు వచ్చినవారు చోటా భీమ్ వంటి అభిమాన పాత్రలను చూసి ఆనందంతో తరించారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ శ్రీకర్ రెడ్డి, కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా, శాన్ ఫ్రాన్సిస్కో, మార్క్ ఆర్మ్‌స్ట్రాంగ్, మేయర్ ఆఫ్ శాన్ రామోన్, శ్రీధర్ వెరోస్, వైస్ మేయర్ ఆఫ్ శాన్ రామోన్, డెంటన్ కార్ల్‌సన్, చీఫ్ ఆఫ్ పోలీస్, శాన్ రామోన్, ట్రేసీ అవెలార్, చీఫ్ ఆఫ్ పోలీస్, ప్లెజంటన్, బెన్ బారియంటోస్, కౌన్సిల్‌మెంబర్, లివర్‌మోర్, దిల్లి భట్టారాయ్, కౌన్సిల్‌మెంబర్, హెర్క్యులస్ కరిష్మా ఖత్రి, ఆఫీస్ ఆఫ్ అసెంబ్లీమెంబర్ లిజ్ ఒర్టెగా (ఎడి20) తదితర ప్రముఖులు వచ్చారు.
ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకర్ రెడ్డి మాట్లాడుతూ, విభిన్న సంఘాలను ఏకం చేసి, భారతదేశపు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కార్యక్రమానికి అనుగుణంగా స్థానిక ఎంట్రప్రెనూర్‌షిప్‌లను ప్రోత్సహిస్తున్నందుకు ఎఐఎ టీమ్‌ను అభినందించారు. మేయర్ ఆర్మ్‌స్ట్రాంగ్ మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమం విజయవంతమైన నిర్వహణను, సంఘం కార్యక్రమాలను ప్రశంసించారు. ‘‘భారతీయ సంస్కృతి తెలియజెప్పడంతోపాటు, స్థానిక వ్యాపారాలకు మద్దతు ఇచ్చేలా ఈ కార్యక్రమం రూపొందించామని, ఈ కార్యక్రమం విజయవంతం చేసిన వారందరికీ ఎఐఎ నిర్వాహకులు ధన్యవాదాలను తెలియజేశారు.
ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్: సంజీవ్ గుప్తా, సిపిఎ, ప్లాటినం స్పాన్సర్: రియల్టర్ లావణ్య దువ్వి, స్ట్రీమింగ్ భాగస్వామి: జీ5, ట్రావెల్ భాగస్వామి: ట్రావెలోపాడ్, పవర్డ్ బై: రియల్టర్ నాగరాజ్ అన్నయ్యతోపాటు పియర్లే విజన్, ఇన్‌స్టా సర్వీసెస్, రేణు బయోమ్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆజాద్ ఆరామండ్ల, భాను మ్యాంగోస్, శ్రీశివసాయి ఇండియన్ మార్ట్ ఇతర స్పాన్సర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం అద్భుతమైన విజయం సాధించడానికి సహకరించిన శాన్ రామోన్ నగర ప్రముఖులకు, సిటీ సెంటర్ బిషప్ రాంచ్, కమ్యూనిటీ సంఘాలు, స్పాన్సర్‌లు, విక్రేతలు మరియు శ్రేయోభిలాషులకు అందరికీ ఎఐఎ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.