BEA2025: న్యూజెర్సీలో వైభవంగా తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకలు

న్యూజెర్సీ (New Jersey) లోని ఎడిసన్ పట్టణంలో మొగల్ బాల్ రూమ్ వేదికగా జరిగిన తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ (Business Excellence Awards) ఫంక్షన్ కి అమెరికాలోని వివిధ పట్టణాల నుంచి ఎంపిక అయిన విజేతలు, తెలుగు సంఘాల నాయకులు న్యూ జెర్సీకి రావడం ఈ అవార్డ్స్ కార్యక్రమానికి పెరుగుతున్న ఆదరణకి నిదర్శనమని తెలుగు టైమ్స్ ఎడిటర్ శ్రీ సుబ్బారావు చెన్నూరి అన్నారు. అమెరికాలో విజయవంతంగా వ్యాపారాలు చేస్తున్న తెలుగు ఎంటర్ ప్రెన్యూర్ ల కోసం గత రెండు సంవత్సరాలుగా చేస్తున్న తెలుగు టైమ్స్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం ఈ సంవత్సరం మూడవసారి న్యూజెర్సీలో ఎడిషన్ పట్టణంలో మొగల్ బాల్రూమ్ వేదికగా ఈ శనివారం 24 మే 25వ తేదీన అత్యంత వైభవంగా జరిగింది.
మొదటగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అభినందన సందేశంతో ఇండియన్ కౌన్సిల్ జనరల్, న్యూయార్క్ శ్రీ వినయ్ శ్రీకాంత్ ప్రధాన్ వీడియో మెసేజ్ తో ప్రారంభమైంది. పిస్కేటవే మేయర్ బ్రెయిన్ వాలర్ ఈ కార్యక్రమానికి వచ్చి తెలుగు టైమ్స్‌ను అభినందించారు ఎడిసన్ నగర మేయర్ శామ్ జోషి ఇండియన్ అమెరికన్ లు ఎక్కడ ఉన్నా చాలా ప్రతిభావంతంగా పని చేస్తారు -ఆ ప్రాంతానికి పేరు తెస్తారని తెలిపారు. కమ్యూనిటీలో ఎందరో విజయపథంలో వెళుతున్న ఎంటర్ప్రెన్యూర్ లు ఉన్నారని వారి సక్సెస్ స్టోరీస్ అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉంటాయని తెలిపారు. ఎంతోమంచి కార్యక్రమాలు చేస్తున్న తెలుగు టైమ్స్‌ని అభినందించారు.
న్యూయార్క్ నగరంలో నాసావ్ కౌంటీ కమిటీ డిప్యూటీ కంట్రోలర్, ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ విభాగ అధికారి శ్రీ దిలీప్ చౌహాన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ఇండియన్స్ తాము బిజినెస్ లో రాణించడమే కాక తమ సంస్కృతిని కూడా ముందుతరాలకు అందిస్తున్నారని ప్రశంసించారు. తెలుగు టైమ్స్ చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల తెలుగు ఎంట్రప్రెన్యూర్ లు అందరికీ ప్రోత్సాహంగా ఉంటుందని, వారి సక్సెస్ స్టోరీ లు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటాయని తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ (ఎఫ్‌ఐఎ) చైర్మన్ శ్రీ అంకుర్ వైద్య మరొక ముఖ్య అతిధిగా వచ్చి ఇండియన్ కమ్యూనిటీని అందులో ముఖ్యంగా తెలుగు కమ్యూనిటీ సేవలను పేర్కొంటూ, తెలుగు టైమ్స్‌ని అభినందించారు. శ్రీ దిలీప్ చౌహాన్, శ్రీ యాంకర్ వైద్య ఎంపిక అయిన విజేతలకు అవార్డులు అందచేశారు.
మొదట కార్యక్రమాన్ని తెలుగు టైమ్స్ ఎడిటర్ అండ్ సీఈవో శ్రీ సుబ్బారావు చెన్నూరి ప్రారంభించిన తరువాత మాట్లాడుతూ తెలుగు టైమ్స్ 2003 లో ప్రారంభమై అమెరికాలో తెలుగు కమ్యూనిటీ అభివృద్ధి అందరితో మీడియాపరంగా పంచుకుంటూ, వారితో పాటు అభివృద్ధి అవుతూ వస్తోందని, ఇప్పటికే 22 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు 2003లో తెలుగువారికి తెలుగు పత్రిక ఇవ్వాలనే ఉద్దేశంతో తెలుగు టైమ్స్ ప్రారంభించామని, ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగు ఎంట్రప్రెన్యూర్ లకి వేదిక ఇవ్వాలని బిజినెస్ అవార్డ్స్ ప్రారంభించామని తెలిపారు. ఎప్పటిలాగే ఈసారి కూడా టీవీ9 మీడియా పార్టనర్ గా సంపూర్ణ మద్దతు ఇస్తోందని, న్యూ జెర్సీ కార్యక్రమానికి ఎఫ్ ఐ ఎ ఆర్గనైజింగ్ పార్ట్నర్ గా ఉందని తెలిపారు. న్యూ జెర్సీ ప్రాంతం చాలా పెద్దదని, తెలుగు కమ్యూనిటీ అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి అని ఇక్కడ అన్ని రంగాల వారు ఉన్నారని తెలిపారు. ఈసారి నామినేషన్ లతో పాటు రెఫెర్రల్స్ చాలా వచ్చాయని, అనేక మంది పెద్దవాళ్ళు వారికి తెలిసిన కంపెనీలను రెఫెర్ చేస్తూ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని వచ్చిన నామినేషన్స్ పరిశీలించి విజేతలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. జాతీయ తెలుగు సంఘాల నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
వాషింగ్టన్ నుంచి డాక్టర్ నరేన్ కొడాలి – ప్రెసిడెంట్ ఎలెక్ట్ తానా, శ్రీ జయంతి చల్లా – ప్రెసిడెంట్ ఆటా, శ్రీ విశ్వేశ్వర్ కలవల – ఫౌండర్ ప్రెసిడెంట్ జిటిఏ, శ్రీ రవి పొట్లూరి – డైరెక్టర్ తానా ఫిలడెల్ఫియా నుంచి వచ్చారని తెలిపారు. అలాగే న్యూజెర్సీలో ఉన్న శ్రీ శ్రీనివాస్ గనగోని – ఫౌండర్ ప్రెసిడెంట్ మాటా, శ్రీ శ్రీహరి మందాడి – ప్రెసిడెంట్ ఎలెక్ట్ – నాట్స్ శ్రీ సుబ్రహ్మణ్యం ఓసూరు – ఐటీ సర్వ్ ఎలియన్స్, న్యూ జెర్సీ చాప్టర్ ప్రెసిడెంట్, శ్రీ ప్రవీణ్ తడకమళ్ళ – ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎన్ ఆర్ ఐ వి ఏ, శ్రీ మురళీ చింతల – చైర్మన్ టి డి ఎఫ్ వచ్చారని, ఇంతమంది జాతీయ తెలుగు సంఘాల నాయకులను ఈ వేదిక మీదకి తీసుకురావడం తెలుగు టైమ్స్ అదృష్టమని సుబ్బారావు అన్నారు. అదేవిధంగా న్యూజెర్సీలో ఉన్న కమిటీ లీడర్స్ శ్రీ దాము గేదల, శ్రీ హరి అప్పనపల్లి, శ్రీ శ్రీ అట్లూరి, శ్రీ శేఖర్ వెంపరాల, శ్రీ మహేష్ సలాది మరియు అనేకమంది నగర ప్రముఖులు వచ్చారని వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి శ్రీ లక్ష్మి కులకర్ణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
అవార్డు గ్రహీతలు
కేటగిరీల వారీగా విజేతల జాబితా ఇలా ఉంది:
1) విద్య – పాఠశాలలు – సిలికాన్ ఆంధ్ర మనబడి సిఇఓ శ్రీ రాజు చామర్తి, శాన్ జోస్, కాలిఫోర్నియా
2) విద్య – కళాశాలలు – తూర్పు వర్జీనియా కెరీర్ కాలేజ్, సిఇఓ – డాక్టర్ కృష్ణ మద్దిపట్ల, వర్జీనియా
3) మహిళా వ్యవస్థాపకురాలు – ఐరిస్ ఇన్ఫోటెక్ ఇంక్. న్యూయార్క్, సిఇఓ – శ్రీమతి శిరీష తూనుగుంట్ల
4) సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్ – చరిష్మా డ్రీమ్స్ ఎంటర్ టైన్ మెంట్స్, డల్లాస్, సిఇఓ – శ్రీ రాజేష్ కాలేపల్లి
5) కల్చరల్ సర్వీసెస్, సిద్ధేంద్ర కూచిపూడి ఆర్ట్ అకాడమీ, న్యూజెర్సీ, వ్యవస్థాపకురాలు – శ్రీమతి స్వాతి అట్లూరి
6) ఫైనాన్స్ – ఇన్సూరెన్స్, టెక్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ, ఆస్టిన్, టెక్సాస్ ప్రెసిడెంట్ – శ్రీ మురళి తాళ్లూరి
7) హోటల్స్ అండ్ రెస్టారెంట్లు – హౌస్ ఆఫ్ బిర్యానీస్ అండ్ కబాబ్స్, న్యూజెర్సీ – శ్రీ శ్యామ్ అమేయ, శ్రీ మహేందర్ సింగిరెడ్డి
8) హోటల్స్ – ఫ్రాంచైజ్ నిర్వహణ – డంకిన్స్, బాస్కిన్ రాబిన్స్, న్యూయార్క్ -సిఇఓ – శ్రీ టిపి శ్రీనివాస్
9) రియల్ ఎస్టేట్ – ఆస్తి నిర్వహణ – విలువ గ్రూప్., న్యూజెర్సీ, వ్యవస్థాపకుడు శ్రీ కుమార్ సాదరమ్
10) ఫార్మా ట్రేడింగ్ – ఆండీ ప్లాజా ఫార్మసీ, న్యూజెర్సీ, వ్యవస్థాపకుడు – శ్రీ శ్యామ్ నాలం
11) ఫార్మా తయారీ – సినర్జియా హెల్త్‌కేర్ ఇంక్, న్యూజెర్సీ, సిఇఓ- భాస్కర్ అంధవరపు
12) కమ్యూనిటీ సర్వీసెస్ – సేవా ఇంటర్నేషనల్, డెన్వర్, సిఇఓ – శ్రీ శ్రీధర్ తలంకి
13) ఐటీ సర్వీసెస్- డిజిటల్ మార్కెటింగ్ – క్లౌడ్ మెలో, డల్లాస్, సహ వ్యవస్థాపకుడు – శ్రీ విజయ్ వర్మ
14) ఐటీ సొల్యూషన్స్ – టెక్నోజెన్ ఇంక్, వాషింగ్టన్ డీసి, సిఇఓ – శ్రీ లాక్స్ చెపురి కి అవార్డులను ఈ వేడుకల్లో ఇచ్చారు.