బే ఏరియాలో ఘనంగా టాటా హోళీ వేడుకలు

బే ఏరియాలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టాటా) ఆధ్వర్యంలో హోళీ 2019 సంబురాలు అట్టహాసంగా జరిగాయి. గత మూడేళ్ళుగా టాటా బే ఏరియా చాప్టర్ టాటా యువ టీం ఈ హోళీ వేడుకలను నిర్వహించింది. ఫ్రీమాంట్‌లోని ఎలిజబెత్ పార్క్‌లో జరిగిన ఈ వేడుకలకు దాదాపు 2500 మందికి పైగా హాజరయ్యారు. హాజరైన వారిలో భారత సంతతికి చెందిన అమెరికా పౌరసత్వం కలిగిన వారు, ఎన్నారైలు, విద్యార్థులు, సందర్శకులు మరియు వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. స్థానికంగా ఉన్న ఏరోడ్యాన్స్ వారి నత్య ప్రదర్శనలు, క్రియా డ్యాన్స్ అకాడమీ మరియు డీజే అర్జవ్ గోస్వామి బందం ఆకట్టుకునే మ్యూజిక్‌తో హాజరైన వారంతా ఈ సంగీతానికి అనుగుణంగా నత్యం చేశారు. లైవ్ దోల్ ఈ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని చేకూర్చింది.
ఇండియన్ ఐడల్ ఫేం మరియు సింగర్ నిత్యశ్రీ ఆకట్టకునే గాత్రంతో ఈ కార్యక్రమానికి మరింత వన్నె తెచ్చారు. స్థానిక యాంకర్ సరస్వతి (సరు), సత్య (టాటా యూత్ ఎఫైర్స్ చెయిర్) ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు.
టాటా బే ఏరియా టీం సతీశ్ బానావత్ (టాటా యూత్ ఎఫైర్స్ చెయిర్), శశాంక్ గౌడ్ (టాటా యువ చైయిర్), టాటా ఆర్‌వీపీలు అమిత్ రెడ్డి (రీజినల్ వైస్‌ప్రెసిడెంట్), వెంకటేశ్ బుక్క (రీజినల్ వైస్ ప్రెసిడెంట్) మరియు ఆర్‌సీ కోఆర్డినేటరర్లు ప్రసాద్, మహేష్, శిరీష కాలేరు, సరస్వతి వరకూర్, రవి నేతి, గోపాల్, కార్తిక్, రాహుల్, నిదేశ్, ఈశ్వరి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించారు. టాటా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ పైళ్ల మల్లారెడ్డి, ప్రెసిడెంట్ విక్రమ్ రెడ్డి జంగం టాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ తరఫున హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. టాటా ఎగ్జిక్యూటివ్ కమిటీ కో ఆర్డినేటర్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాస మనప్రగడ ఈ సందర్భంగా స్పాన్సర్లు, మీడియా మరియు హాజరైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.