అమెరికాలో ప్రాక్టీస్ మొదలుపెట్టిన రోహిత్ సేన
జూన్ 2 నుంచి జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం టీం ఇండియా సిద్ధమవుతోంది. అమెరికా, వెస్టిండీస్ లలో జరగనున్న ఈ టోర్నీకోసం సోమవారం నుంచి వార్మప్ మ్యాచ్లు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రోహిత్ సేన ప్రాక్టీస్ మొదలుపెట్టింది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ ఆధ్వర్యంలో సాధన చేసింది. ఇందులో రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్ తదితరులు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. అనంతరం ఆటగాళ్లంతా కాసేపు ఫుట్ బాల్ ఆడారు. ఆ తర్వాత వర్కౌట్స్ చేశారు.







