కరోనా విపత్తు వేళ…ఆదుకోవడానికి ముందుకొచ్చిన తానా

భారత్‍లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్‍వేవ్‍తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుకు వచ్చింది. రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ఆసుపత్రులు నిండిపోయి పేషంట్లకు అవసరమైన ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో కమ్యూనిటీకి తనవంతుగా సహాయపడేందుకు తానా ముందుకొచ్చింది. ఈ సందర్భంగా అవసరమైన అత్యవసరమైన పరికరాలను, ఆక్సిజన్ కాన్సెన్‍ట్రేటర్స్, వెంటిలేటర్స్తోపాటు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని తానా భావిస్తోంది. ఈ సందర్భంగా దాతలు తమ విరాళాలను తానా కోవిడ్ ఫండ్‍కు ఇవ్వాల్సిందిగా ఓ ప్రకటనలో కోరింది. విరాళాలు ఇవ్వాల్సిన లింక్‍ను ఇక్కడ ఇస్తున్నాము.
You can Donate to TANA COVID Fund
https://tana.org/payment/donate/projects
(select covid relief as “I want to donate for” drop down)
Facebook: https://www.facebook.com/donate/491412422272899/10159160767884547/
Interested people can also mail checks to below address:
TANA Foundation,
Covid Releief Fund,26233 Taft Rd, Novi, MI 48374