తానా డిఎఫ్‌డబ్ల్యు ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌ల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డల్లాస్ ఏరియా ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, స్కూల్ బ్యాగ్‌లను కిట్‌లను అందజేశారు. తానా మాజీ అధ్యక్షుడు నవనీతకృష్ణ గొర్రెపాటి అమెరికా కమ్యూనిటీకి తమవంతు ఏదైనా సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని తానాలో ప్రవేశపెట్టారు. ఆయన ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని నేటికీ తానా నాయకులు కొనసాగిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా తానా వివిధ ఏరియాల్లో ఉన్న స్కూళ్ళలో ఉన్న పేద విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా సహాయం అందిస్తున్నది. ఈ కార్యక్రమంలో తానా రిజినల్ వైస్ ప్రెసిడెంట్ సతీష్ కొమ్మన, మాజీ అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ మురళి వెన్నం, రిజీనల్ వైఎస్ ప్రెసిడెంట్ సాంబ దొండ, లోకేష్ నాయుడు లెనిన్ తాళ్లురి, రాజా నల్లూరి తదితరులు పాల్గొన్నారు. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి, తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ నిరంజన్ శృంగవరపు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు తానా డిఎఫ్‌డబ్ల్యు ఏరియా టీమ్‌ను అభినందించారు.