TANA: న్యూయార్క్‌లో స్కూల్ పిల్లలకు తానా బ్యాగుల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) న్యూయార్క్ బృందం ఆధ్వర్యంలో విండాంచ్ యూనియన్ ఫ్రీ స్కూల్ డిస్ట్రిక్ట్‌లోని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లు, సామాగ్రిని పంపిణీ చేశారు. తానా కోశాధికారి రాజా కసుకుర్తి బ్యాక్‌ప్యాక్ స్పాన్సర్ గా వ్యవహరించారు. దాదాపు 100 మంది విద్యార్థులకు బ్యాక్‌ప్యాక్‌లను తానా టీమ్ అందజేసింది. తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి నాయకత్వంలో, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని సహకారంతో అమెరికాలోని కమ్యూనిటీకి సేవ చేయడానికి తానా బ్యాక్‌ప్యాక్ కార్యక్రమాన్ని వివిధ చోట్ల నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని తానా న్యూయార్క్ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు మరియు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు సుచరిత అనంతనేని, రాజిత కల్లూరి, జితేంద్ర యార్లగడ్డ, దిలీప్ ముసునూరి, ప్రసాద్ కోయి, శ్రీనివాస్ నడెళ్ల సమన్వయం చేశారు. తానా కిడ్ వాలంటీర్లు సుదీక్ష ముసునూరి, సుహాస్ ముసునూరి, సమన్విత మిన్నెకంటి, ఆశ్రిత కోయి, శరణ్ సాయి భర్తవరపు, గీతిక చల్లా, రాజిత్ రెడ్డి, రమ్య రెడ్డి, లోహితాక్ష్ సాయి నడెళ్లుకూడా ఈ కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషించారు. కమ్యూనిటీ లీడర్ ప్రసాద్ కంభంపాటి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు, ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టినందుకు తానాను అభినందించారు.
విండాంచ్ యూనియన్ ఫ్రీ స్కూల్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్స్ మరియు ఉపాధ్యాయులు తమ పాఠశాలను బ్యాక్‌ప్యాక్ కార్యక్రమానికి ఎంపిక చేసి, తమ సేవా కార్యక్రమాలలో భాగంగా పిల్లలకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసినందుకు తానాకు కృతజ్ఞతలు తెలిపారు.