TANA: మిన్నియాపోలిస్ లో తానా ఫుడ్ డొనేషన్ విజయవంతం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రెసిడెంట్ నరేన్ కొడాలి, వైస్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీని లావు ప్రోత్సాహంతో, తానా నార్త్ సెంట్రల్ టీమ్ ఆర్ వి పి రామ్ వంకిన ఆధ్వర్యంలో మిన్నియాపొలిస్, మిన్నెసొటాలో ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ (ఎఫ్ ఎం ఎస్ సి) సెంటర్ లో ఫుడ్ ప్యాకింగ్ చేసి పిల్లలకు ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సుమారు 70 వాలంటీర్స్ పాల్గొన్నారు. ఐదున్నర లక్షల విలువైన 21,384 ఫుడ్ ప్యాకెట్లను తానా నాయకులు అందించారు. కార్యక్రమంలో ఆరేళ్ళ వయసు వున్న చిన్నపిల్లలు కూడా పాల్గొనడం ఆకట్టుకుంది. తానా టీం ప్యాక్ చేసిన ఈ పోషకమైన ఈ ఆహరం పలు దేశాలలో అవసరమైన చిన్నారులకు ఆకలి లేకుండా చేస్తుంది.
ఈ సందర్భంగా ఎఫ్ ఎం ఎస్ సి నిర్వాహకులు మాట్లాడుతూ, తానా కమ్యూనిటీకి చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. తానా అవసరమైన పిల్లలకు పోషకమైన ఆహరం పంపిణీ చేసేందుకు తమ వంతు సహకారం పలు సందర్భాల్లో అందిస్తున్నందుకు వారు స్థానిక తానా నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. తానా ప్రెసిడెంట్ నరేన్ కొడాలి ఈ సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఇలాంటి సేవా కార్యక్రమాలను అమెరికా లో పలు రాష్ట్రాలలో నిర్వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తానా నార్త్ సెంట్రల్ టీంను, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరని అభినందించారు. ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచిన తానా ప్రతినిధి రామ్ వంకినకు ఎఫ్ ఎం ఎస్ సి అధికారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి తానా నార్త్ సెంట్రల్ వలంటీర్స్ వెంకట్ జువ్వ, వేదవ్యాస్ అర్వపల్లి, జయరాం నల్లమోతు, అజయ్ తాళ్లూరి, రామకృష్ణ అన్నే, సురేష్ బొర్రా, కోటేశ్వరరావు పాలడుగు, అనిల్ పోతకమూరి, చంద్ర చెన్నుపాటి, మధు గొడుగుచింత, పూర్ణ గుర్రం, విజయ ముత్యల, ఇందు నల్లమోతు, అంజనీ పోతకమూరి, శ్రేయ చెన్నుపాటి, పుష్ప బొర్రా, వంశి కొల్లా, ప్రదీప్ కోగంటి, బాబ్జి చెన్నుపాటి, శ్రీనివాస్ కన్నెగంటి, శ్రీకృష్ణ గార్లపాటి, పవన్ యార్లగడ్డ, రాజేష్ రెడ్డి, నాగ్ బొల్లు, శ్రీధర్ కడియాల, వెంకట్ ఉయ్యురు, కొండయ్య నారా తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వలంటీర్లందరికీ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు.