Beauty Movie: ‘బ్యూటీ’ అందరి మనసులకు హత్తుకునే చిత్రం – వీకే నరేష్

అంకిత్ కొయ్య, నీలఖి, వీకే నరేష్, వాసుకి ప్రధాన పాత్రలో విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బ్యూటీ’ (Beauty). ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించగా.. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 19న విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం నాడు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో..
వీకే నరేష్ మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’ మూవీలోని సోల్ మా అందరినీ ప్రమోషన్స్‌లో ఎక్కువ మాట్లాడించేసింది. ఆ సోల్ ఇప్పుడు ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతోంది. దర్శక, నిర్మాతలకు సినిమా రిలీజ్‌కంటే ముందే శాలువా కప్పేశాను. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు ముందే తెలుసు. నా కెరీర్‌లో 350 మూవీలు చేసి ఉంటాను.. ఈ చిత్రానికి వచ్చిన రివ్యూలన్నీ కూడా ప్రింట్ అవుట్ తీసుకుంటున్నాను. ఇలాంటి రివ్యూలు నా జీవితంలో ఇంత వరకు రాలేదు. మా మూవీని ఇంత ఆదరించినా మీడియాకు థాంక్స్. నా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ ఈ మూవీ నాకు మాత్రం ఎంతో స్పెషల్. ప్రతీ ఒక్కరికీ, అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యే చిత్రమిది. అందరి మనసులకు హత్తుకునే మూవీని తీసిన వర్దన్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. సుబ్బు మంచి కథను ఇచ్చారు. సాయి కుమార్ కెమెరావర్క్ ఎంతో అందంగా అనిపించింది. విజయ్ పాల్ రెడ్డి గారు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఒకే నెలలో సక్సెస్, ఫెయిల్యూర్ చూశాడు. నిండు కుండ తొకణదు అన్నట్టుగా నిర్మాత ఉన్నారు. నీలఖి అద్భుతంగా నటించారు. అంకిత్ కొయ్య ఇండస్ట్రీలో నిలిచిపోతాడు. విజయ్ బుల్గానిన్ మంచి సంగీతాన్ని అందించారు. లవ్, ఎమోషన్స్, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల అంశాలను జోడించిన ఈ మూవీని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
అంకిత్ కొయ్య మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’ అందరికీ రీచ్ అయింది. క్లైమాక్స్ తరువాత అందరూ కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. అదే మా విజయం. ప్రీమియర్ల నుంచే మీడియా మాకు చాలా సపోర్ట్ చేసింది. మీడియానే భుజాన వేసుకుని ఆడియెన్స్ వరకు రీచ్ చేసింది. నా ఫ్రెండ్స్, సెలెబ్రిటీలకు షో వేస్తే.. వాళ్లకి నచ్చడంతో మరింతగా ప్రమోట్ చేశారు. మనం చేసే పని మాత్రమే కాదు.. మనం కూడా మాట్లాడాలి. నేను నటించిన ఏ మూవీ కూడా ఏ ఒక్కరినీ నిరాశపర్చలేదు. అంకిత్ కొయ్య అంటే మినిమం గ్యారెంటీ అనేది పక్కా. సినిమాను నిజాయితీగా తీస్తే సక్సెస్ అదే వస్తుంది. మన మీద ఎంత మంది రాళ్లు విసిరినా సరే వాటితోనే ఇల్లు కట్టుకుందాం. ఇంతలా మా మూవీని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
డైరెక్టర్ జె.ఎస్.ఎస్ వర్ధన్ మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’ మూవీని సపోర్ట్ చేసిన మీడియాకు థాంక్స్. ‘బ్యూటీ’ ప్రతీ ఒక్కరినీ ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పటి వరకు 15 థియేటర్లను విజిట్ చేశాను. ప్రతీ ఒక్కరూ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చూడని వాళ్లంతా వెళ్లి చూడండి. ఏదో ఒక చోట.. ఎక్కడో ఓ సీన్‌కు ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారు. సాయి ఇచ్చిన విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ప్రధాన బలాన్ని ఇచ్చింది. ఇంతలా సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత విజయ్ పాల్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’ ఆల్రెడీ కమర్షియల్‌గా సక్సెస్ అయింది. ప్రతీ ఒక్కరూ ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. అద్భుతమైన మూవీ అని, గుండె బరువెక్కిందని మాట్లాడుతున్నారు. మీడియా, ఆడియెన్స్ ఇలా అందరూ గొప్పగా ఆదరిస్తున్నారు. మన జీవితాల్ని చూపించే, ప్రతీకగా నిలిచే చిత్రమిది. ఇది కేవలం సినిమా కాదు.. జీవితం’ అని అన్నారు.
హీరోయిన్ నీలఖి మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’ మూవీని ఇంతలా ఆదరిస్తున్న మీడియాకి, ప్రేక్షకులకు థాంక్స్. నా పాత్రపై ప్రశంసలు కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’లాంటి మంచి చిత్రాలు వచ్చినప్పుడు మీడియా ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. మీడియా నుంచి సానుకూలమైన స్పందన వచ్చింది. మంచి చిత్రాల్ని ఎప్పుడూ మీడియా ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది’ అని అన్నారు.
రైటర్ ఆర్.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ .. ‘మా ‘బ్యూటీ’ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియాకు థాంక్స్. మేం థియేటర్ విజిట్‌కు వెళ్తుంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతీ రోజూ షోలకు డిమాండ్ పెరుగుతోంది. అందరూ అన్ని పాత్రలకు కనెక్ట్ అవుతున్నారు. మహిళలు అయితే సినిమా చూసిన తరువాత కంటతడి పెట్టుకుంటున్నారు’ అని అన్నారు.
కెమెరామెన్ సాయి కుమార్ ధారా మాట్లాడుతూ .. ‘‘బ్యూటీ’ విషయంలో నాకు టీం చాలా సహకరించింది. అంకిత్ బాగా నటించాడు. భాష రాకపోయినా నీలఖి అద్భుతంగా నటించింది. నరేష్ గారు, వాసుకి గారు ఈ సినిమాకు ప్రధాన బలం. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. మా మూవీని ఇంతగా ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.